మన్మోహన్ సింగ్‌ను అన్నలా భావించేవాడిని: దలైలామా
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా స్పందించారు. మన్మోహన్ సలహాలను అభినందించేవాడినని దలైలామా తెలిపారు. ఆయన్ని అన్నగా భావించేవాడిని అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు మన్మోహన్ భార్య గురుశరణ్ కౌర్‌కు దలైలామా లేఖ రాశారు. ‘ఇతరులకు సాయం చేయాలని మీ భర్త బలంగా ఆకాంక్షించేవారు. భారత దేశ అభివృద్ధిలో, ముఖ్యంగా ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు’ అంటూ వ్యాఖ్యానించారు.