త్వరలోనే 8,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్
AP: వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది ఎంతో అవసరమన్నారు. మెరుగైన సేవలు అందించేలా 7 నుంచి 8 వేల మంది నియామకాలకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రైమరీ ఆస్పత్రుల్లో 28.96 శాతం, జిల్లా ఆస్పత్రుల్లో 14.51 శాతం, మిగతా చోట్ల 63.40 శాతం సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు వివరించారు.