ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఆ వాహనాలకు పన్ను రాయితీ

75చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఆ వాహనాలకు పన్ను రాయితీ
AP: రాష్ట్రంలో విద్యుత్ వాహనాలను(ఈవీ) కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి పూర్తిగా పన్ను రాయితీ ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 (2024-29)ని అమల్లోకి తీసుకురాగా, అది ఉన్నంతకాలం ఈవీలకు మోటారు వాహన పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది. హైబ్రిడ్ నాలుగు చక్రాల వాహనాలకు మాత్రం ఇది వర్తించదని ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్