సంక్రాంతికి కోడి పందేలు, గుండాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: పోలీసులు

81చూసినవారు
సంక్రాంతికి కోడి పందేలు, గుండాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: పోలీసులు
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంక్రాంతి సంబరాల పేరుతో సిద్ధం చేసిన కోడిపందాల బరులను పోలీస్, రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. నందిగామ మండలం రాంరెడ్డి పల్లి గ్రామం వద్ద కోడి పందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు బరులు సిద్ధం చేశారు. ఈ విషయం తెలుకున్న పోలీసులు, తహశీల్దార్ సురేశ్ సంఘటనా స్థలానికి చేరుకొని బరులను ధ్వంసం చేయించారు. సంక్రాంతి పేరుతో కోడి పందాలు, పేకాటలో గుండాట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్