నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు
కోటవురట్ల మండలం పాత రోడ్డు వద్ద వరాహా నదిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. వంతెనలకు 500 మీటర్ల లోపు ఇసుక తవ్వకాలు జరపరాదని నిబంధనలు ఉన్నాయని, వాటిని పట్టించుకోకుండా యథేచ్చగా వంతెన కింద అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని వాపోయారు. దీంతో వంతెన దెబ్బతినే పరిస్థితిలు కనిపిస్తున్నాయని అధికారులు స్పందించాలని కోరారు.