ఎస్ రాయవరం: రూ. 10 కోట్లతో రహదారి నిర్మాణ పనులు
ఎస్ రాయవరం మండలంలో రూ. 2కోట్లతో 96 గోకులం షెడ్లను నిర్మిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పూర్ణిమాదేవి తెలిపారు. మంగళవారం ఎస్ రాయవరంలో ఆమె మాట్లాడుతూ మండలంలో రూ. 10 కోట్లతో ఉపాధి నిధులతో కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. 2025-26లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతి పంచాయతీకి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసామన్నారు. ఏపీఓ ఎరకయ్య పాల్గొన్నారు.