అక్కిరెడ్డిపాలెం: విశాఖ డెయిరీ ఉద్యోగుల రిలే దీక్షలు
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ డెయిరీ ఉద్యోగులు అక్కిరెడ్డిపాలెం డెయిరీ ముందు గురువారం నుంచి రిలే నిరాహార దీక్షకు దిగారు. విశాఖ కో-ఆపరేటివ్ డెయిరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కే వి వి మూర్తి, కార్యదర్శి ఎస్. రమణ మాట్లాడుతూ కనీస వేతనం రూ. 21,000 కు పెంచాలన్నారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా బోనస్ ఎక్స్ గ్రేషియో చెల్లించాలన్నారు. అగ్రిమెంట్ పద్ధతిపై ఉన్న ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయాలన్నారు.