గాజువాకలో విషాదం
గాజువాకలో విషాదం చోటు చేసుకుంది. ఆటో నగర్ లోని ఎస్ఆర్ ఎంటి షోరూమ్ లో సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్న దాసరి కామేశ్వరరావు (42) బుధవారం గుండెపోటుతో విధులు నిర్వహిస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తోటి ఉద్యోగులకు అర్థం కాలేదు. స్పృహ కోల్పోయాడు ఏమో అని నీళ్లు జల్లి లేపే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను మృతి చెందాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమారాలో రికార్డ్ అయ్యింది.