జియోకు ప్రధాని మోదీ ప్రచారకర్త
భీమవరం పట్టణంలోని రిలయన్స్ సూపర్ మార్కెట్ ఎదురుగా సీపీఎం నాయకులు సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం మాట్లాడుతూ. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రైవేట్ టెలికాం సంస్థలు మొబైల్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నాయన్నారు. అంబానీ కంపెనీ జియోకు ప్రధాని మోదీ ప్రచారకర్తగా మారిపోయారని విమర్శించారు.