భీమవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
భీమవరం పట్టణంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లంకపేటకు చెందిన ఎం. మహేశ్(18) అతడి స్నేహితుడు సాగర్తో కలిసి ద్విచక్ర వాహనంపై బుధవారం దుర్గాపురం రోడ్డులో భీమవరం వైపు వస్తుండగా మరో బైక్పై వచ్చిన గౌతమ్ ఢీకొన్నాడు. ఈ ఘటనలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ఎస్సై రెహమాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.