కార్యకర్తలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సూచన

70చూసినవారు
దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చింతమనేని ప్రభాకర్‌ను పెదపాడు మండలానికి చెందిన పలువురు నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు మనకు ఇచ్చింది అధికారం కాదు, బాధ్యత అని అన్నారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్