పగో జిల్లాలో తీవ్ర విషాదం
పెరవలి మండలం కానూరు గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీరాఘవ అమెరికాలోని డల్లాస్‌లో హార్ట్ అటాక్‌తో మృతిచెందారు. ఎమ్మెస్ డిగ్రీ పూర్తి చేసిన శ్రీరాఘవ, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ఆయన మరణంపై బంధువులు విచారాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం అతని మృతదేహం స్వగ్రామం కానూరుకు తీసుకురావాలని నిర్ణయించారు.