స్పెయిన్లోని వాలెన్సియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని కారణంగా ఇప్పటివరకు 140 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. అనేకమంది ఆచూకీ తెలియరాలేదని పేర్కొన్నారు. మరోవైపు వరదల్లో వందల కార్లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.