ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీపై ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆసక్తికర ట్వీట్ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌లో మద్యంలో భారీ కుట్రకు సీఎం చంద్రబాబు ప్లాన్ వేసినట్లు ఆరోపిస్తూ ఓ ఫొటో విడుదల చేశారు. ఏపీలో మద్యం అమ్మకాల్లో భారీ దోపిడీకి రంగం సిద్ధమైందని పోస్టర్‌లో వైసీపీ పేర్కొంది. ఒక్కో బాటిల్‌పై రూ.3 చొప్పున కరకట్ట బంగ్లాకు కప్పం కట్టనున్నట్లు ఆరోపించింది.