విశాఖ నుంచి 105 కిలోమీటర్లు, అనకాపల్లి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాడేరు టౌన్. అక్కడి నుంచి పశ్చిమాన నాలుగుకిలోమీటర్ల దూరంలో ఉన్న లగిసపల్లికి చేరుకోవాలి. ఆ ప్రాంతం నుంచి మరో మూడుకిలోమీటర్లు వెళితే వంజంగి గ్రామం వస్తుంది. ఆ గ్రామం నుంచి రెండుకిలోమీటర్ల దాకా తారురోడ్డు ఉంది. వాహనాలని అక్కడే నిలిపి కొండెక్కడం మొదలు పెడితే గంటలో వంజంగి శిఖరాన్ని చేరుకుంటాం.