

ఉగ్రదాడి.. 11 మందిని కాపాడిన కశ్మీర్ వాసి (వీడియో)
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను చంపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సాజద్ అనే ఓ కశ్మీర్ వ్యక్తి 11 మందిని కాపాడాడు. తన భుజాలపై మోసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాడు. పర్యాటకులపై ఉగ్ర దాడి విషయం తెలిసి అక్కడకు వెళ్లానని, పర్యాటకుల ఏడుపు చూసి కన్నీళ్లు వచ్చాయని సాజద్ పేర్కొన్నాడు. మతం కంటే తమకు మానవత్వమే ముఖ్యమని, ప్రాణాలకు తెగించి కాపాడినట్లు తెలిపాడు.