ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం కోసం ఓ మృతదేహాన్ని అంబులెన్సు సిబ్బంది రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. కనీసం చనిపోయిన వ్యక్తి పట్ల మానవత్వం లేకుండా సిబ్బంది ప్రవర్తించారు. మృతదేహం కాళ్ళు పట్టుకుని లాక్కుంటూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వారిపై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.