

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం: మంత్రి లోకేశ్ (వీడియో)
AP: మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవడానికి చాలా కష్టపడ్డానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని చిన్నకాకానిలో 100 పడకల ఆస్పత్రికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.