తజికిస్తాన్‌లో ఈ రోజు ఉదయం 9:54 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. తజికిస్తాన్ పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మీక్తిలియా ప్రాంతంలో 5.5 తీవ్రతతో మరో భూకంపం కూడా నమోదైనట్టు భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది.