సంక్రాంతికి ఇక్కడ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయి..!
మకర సంక్రాంతి రోజున గంగా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. మకర సంక్రాంతి రోజున పశ్చిమ బెంగాల్లోని పవిత్ర ప్రదేశమైన గంగా సాగర్లో స్నానం చేయడం శుభపరిణామం. ఇక్కడ గంగా నది, సముద్రం కలుస్తాయి కాబట్టి ఈ ప్రాంతానికి గంగా సాగర్ అనే పేరు వచ్చింది. సంక్రాంతి రోజు ఇక్కడ స్నానమాచరించిన వారికి పది అశ్వమేధ యాగాలు చేసిన, వేయి గోదానాలు చేసినంత ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.