హిందువులు జరుపుకునే పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజున శబరిమలలో అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ మకర జ్యోతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మకర జ్యోతి దర్శనం అంటే మకరవిళక్కు శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో జరిగే ముఖ్యమైన వార్షిక వేడుక. ఇది శబరిమల ఆలయంలో దర్శనం ఇచ్చే పవిత్రమైన కాంతి.. దీనిని మకర జ్యోతి అని పిలుస్తారు. మకర జ్యోతిని దర్శనం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య జరుగుతుంది.