రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అవే 'బెల్ వెదర్' సెగ్మెంట్లు. వీటి ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి రావచ్చో అంచనా వేయొచ్చు. ఢిల్లీలోనూ 1993 నుంచి ఓ సెంటిమెంట్ కొనసాగుతోంది. అదేంటంటే.. మాల్వియా నగర్, మాదిపూర్, పాత్పర్‌గంజ్, గాంధీనగర్, చాందినీ చౌక్, తిమార్‌పూర్, మోడల్ టౌన్, సర్దార్ బజార్, పటేల్‌నగర్, కరోల్‌బాగ్ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో వాళ్లు అధికారంలోకి వస్తారని గణాంకాలు చెబుతున్నాయి.