తమలపాకుతో షుగర్ వ్యాధికి చెక్
తమలపాకులోని ఔషధ గుణాలు పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకు నమిలినా, తమలపాకు వేసి మరిగించిన నీరు తాగినా.. జలుబు, గొంతు సమస్యలు తగ్గిపోతాయి. నోటి దుర్వాసన రాదు. చర్మంపై వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి. తమలపాకు రసం గుండెలో మంటను తగ్గిస్తుంది. బాలింత రొమ్ముల్లో పాలు గడ్డకట్టి నొప్పిగా ఉంటే, ఈ ఆకును వేడి చేసి ఛాతిపై ఉంచితే ఉపశమనం కలుగుతుంది. తమలాపకును తింటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.