సెలవు రోజుల్లోనే అధికంగా దొంగతనాలు: పోలీసుల హెచ్చరిక

53చూసినవారు
సెలవు రోజుల్లోనే అధికంగా దొంగతనాలు: పోలీసుల హెచ్చరిక
నగర ప్రాంతాల్లో పక్కింటి వారు ఉన్నారో లేరో అనే సంబంధం లేకుండా ఒకరికొకరు వ్యవహరిస్తుంటారు. దీంతో కాలనీల్లో దొంగలు యథేచ్ఛగా సంచరిస్తూ ఏ ఇంటికి తాళం ఉందో నిఘా వేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. సెలవుల్లో చాలా మంది సొంత ఊళ్లకు పయనమవటం, విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలకు ప్లాన్​ చేసుకోవటం జరుగుతుంది. ఇదే అదునుగా భావించి ఇతర సమయాలతో పోలిస్తే సెలవు రోజుల్లో దొంగతనాలు 30 శాతం అధికంగా నమోదవుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్