భారత యువ క్రికెటర్ అన్షుల్ కాంబోజ్ భారీ ధరకు అమ్ముడుబోయాడు. అతడి కనీస ధర రూ.30 లక్షలు కాగా ముంబై, చెన్నై జట్లు అతడి కోసం పోటీపడ్డాయి. చివరికి చెన్నై అతడికి రూ.3.40 కోట్లు చెల్లించి దక్కించుకుంది. కాగా, ఇటీవల రంజీ ట్రోఫీలో అన్షుల్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. మరో యువ ప్లేయర్ షేక్ రషీద్‌ను కూడా చెన్నై ఫ్రాంచైజీ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.