పవన్ కళ్యాణ్‌కు రోజా సూటి ప్రశ్న
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైసీపీ మాజీ మంత్రి రోజా సూటిగా ప్రశ్నించారు. శనివారం నగరిలో రోజా మాట్లాడుతూ.. ‘సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు మానవత్వం లేదని పవన్ అన్నారు. మరి గేమ్ ఛేంజర్ ఈవెంట్లో ఇద్దరు చనిపోతే.. బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు. అల్లు అర్జున్‌కు ఉన్న మానవత్వం కూడా మీకు లేదా? తిరుపతిలో ఇంత ఘోరం జరిగితే ఇప్పుడెందుకు మాట్లాడరు?’ అని ప్రశ్నించారు.