AP: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా.. కాకినాడకు చెందిన మణికంఠ, చరణ్ రోడ్డు ప్రమాదం మృతి చెందిన విషయం తెలిసిందే. నిన్న పిఠాపురం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అయితే పవన్ కళ్యాణ్ తమకు 2 నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని మణికంఠ, చరణ్ కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. మమ్మల్ని పలకరించనప్పుడు ఎందుకు రమ్మన్నారని ప్రశ్నించారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి పవన్ వెళ్లిపోయారన్నారు.