సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ

70చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఇవాళ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్‌పై వెళ్లారు.
ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి పంచె కట్టి సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లి అందరిని ఆకర్షించారు. ఢిల్లీలో కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాను ఇలా సైకిల్‌పై వచ్చినట్లు కలిశెట్టి తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్