టెన్త్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు!
AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చి 31న సాంఘిక శాస్త్రం ఎగ్జామ్ జరగనుంది. అయితే ఆ రోజున రంజాన్ సెలవు దినంగా ప్రభుత్వ క్యాలెండర్లో ఉంది. నెలవంక 31న కనిపిస్తే అదే రోజు రంజాన్ ఉంటుంది. నెలవంక కనిపించే విషయాన్ని బట్టి పండగ అదే రోజు వస్తే మరుసటి రోజు ఏప్రిల్1కి పరీక్షను పోస్ట్‌పోన్ చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.