సొంత పనుల్లో హెచ్ఎం.. తరగతి గదిలో వాలంటీర్

75చూసినవారు
సొంత పనుల్లో హెచ్ఎం.. తరగతి గదిలో వాలంటీర్
AP: విశాఖలోని రోలుగుంట మండలం బుచ్చెంపేట ప్రాథమిక ప్రధానోపాధ్యాయుడు నాగభూషణం ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ వేసి రియల్ ఎస్టేట్ పనులకు వెళ్లిపోతున్నారని, విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు అనధికారికంగా వాలంటీర్‌ను నియమించుకున్నారని ఎంఈవో, జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదులు వెళ్లాయి. నెలకు వాలంటీర్‌కు రూ.5 వేలు చెల్లిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎంఈవో స్పందిస్తూ.. విచారణ జరిపి త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్