AP: గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు దగ్గర అర్ధరాత్రి తీరం దాటింది. శుక్రవారం ఉదయం నాటికి అల్పపీడనం బలహీనపడనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.