బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆరిజన్ డైరీ సిఏఓ బోడపాటి షేజల్ కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి ఆమె వినతి పత్రం అందజేశారు. బెల్లంపల్లి మండలం కన్నాల శివారులోని ప్రభుత్వ భూమి చిన్నయ్య తన భూమిగా నమ్మబలికి తన సంస్థకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేస్తానని తమ వద్ద 30 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు.