Oct 29, 2024, 00:10 IST/
ఘోర అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
Oct 29, 2024, 00:10 IST
హైదరాబాద్ యాకుత్ పుర రైల్వేస్టేషన్ ప్రాంతంలో సోమవారం రాత్రి మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో మంటలు టాపాసులకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో మోహన్ లాల్, ఉషాబాయి దంపతులు మృతి చెందారు. గాయపడిన వారి కుమార్తె శ్రుతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.