
రాబోయే 3 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే 3 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద నిలబడవద్దని, పిడుగుల పడే అవకాశం ఉందని హెచ్చరించారు.