బాంబుల నుంచి దేశాన్ని కాపాడిన ఓ ఎలుక గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. కంబోడియాకు చెందిన ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ఎలుక రోనిన్ ఆగస్టు 2021 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య కంబోడియాలో 109 ల్యాండ్ మైన్లు, 15 బాంబులను గుర్తించింది. రోనిన్‌కు ముందు మగావా అనే ఎలుక 71 ల్యాండ్ మైన్లు, 38 బాంబులు గుర్తించింది. దీంతో రోనిన్ అత్యధిక పేలుడు పదార్థాలను గుర్తించిన ఎలుకగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.