ఢిల్లీలో యువకుడి దారుణ హత్య (వీడియో)
ఢిల్లీలో దారుణ ఘటన నెలకొంది. నగరంలోని గీతాకాలనీ నుంచి రాజ్ ఘాట్ వెళ్లే రోడ్డుపై ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు ఆదివారం దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.