AP: ఆర్థిక సమస్యలతో టీడీపీ అభిమాని శ్రీను ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో ఆదివారం ఎమోషనల్ పోస్టు పెట్టారు. ‘ఎప్పుడూ అన్నా అని ప్రేమగా పిలిచేవాడికి. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా సాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా బర్త్ డే, పెళ్లి రోజును పండగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకు ఓ మెసేజ్ చేయాలనిపించలేదా? తప్పు చేశావ్ తమ్ముడు. ఓ అన్నగా మీ కుటుంబానికి అండగా ఉంటా.’ అని మంత్రి లోకేశ్ రాసుకొచ్చారు.