TG: రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తిమ్మాపూర్ హుక్స్ కంపెనీ దగ్గర కూలీలతో వెళ్తున్న ట్రాక్టరు శనివారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో పాటు మహిళా కూలి మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.