AP: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా నరసింహాపురంలో చోటు చేసుకుంది. మూడో తరగతి చదువుతున్న బాలిక తొడపై కొరికి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. చిన్నారి ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు వేణుగోపాలరావును పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.