AP: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి శివాలయంలో నాగుల చవితి రోజున నాగుపాము దర్శనం ఇచ్చింది. శివాలయంలో నాగుపాము దర్శనం ఇవ్వడంతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కొందరు భక్తులు పాముకి ఓ గిన్నెలో పాలు పోసారు. నాగుల చవితి సందర్భంగా నాగుపాము దర్శనం ఇవ్వడంతో భక్తులు ఆసక్తికరంగా తిలకించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.