ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత యువ బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్ మొట్టమొదటి అన్‌సోల్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. దేవదత్ పడిక్కల్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ కూడా ముందుకు రాలేదు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో సెట్ 3లో ఆక్షన్‌కి వచ్చిన పడిక్కల్‌ను అన్‌సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. 2020 ఐపీఎల్లో అరంగేట్రం చేసిన పడిక్కల్ ఇప్పటివరకు రాజస్థాన్, బెంగళూరు, లక్నో జట్లకు ఆడాడు.