చేపల వలకు చిక్కిన భారీ కొండచిలువ (వీడియో)

78చూసినవారు
చెరువులో చేపల కోసం వేసిన వలకు భారీ కొండ చిలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండచిలువ చిక్కింది. కొండచిలువను చెరువు కట్ట పైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు వల నుండి కొండచిలువను వేరుచేశారు. దాన్ని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలిపెడతామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహమ్మద్ అమిద్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్