మనం రోజూచూసే కాకులు పగబడతాయని మీకు తెలుసా? తమకు అపకారాన్ని చేసిన వ్యక్తుల ముఖాలను ఏకంగా 17 ఏండ్లపాటు గుర్తుంచుకొంటాయట. అంతేకాదు, ‘మన కుటుంబానికి వాళ్లు అన్యాయం చేశారు. వదిలిపెట్టొద్దు’ అంటూ పెద్ద కాకులు తమ సంతానానికి చెప్పిమరీ తనువు చాలిస్తాయట. ఈ విషయాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ మార్జ్‌లఫ్ నేతృత్వంలోని పరిశోధక బృందం వెల్లడించింది.