స్టార్ హీరోయిన్‌కు వేధింపులు
స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ‘సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని, చంపేస్తానంటూ కామెంట్స్ పంపిస్తున్నాడు’ అని ఫిర్యాదు చేసింది. అతడు బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది. పోలీసులు కేసు నమోదు చేశారు.