తిరుపతి రుయా ఆస్పత్రి మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనిత, ఎ.సత్యప్రసాద్, పార్ధసారథి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇవాళ పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరి కాసేపట్లో బాధిత కుటుంబాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించనున్నారు.