ఎప్పుడెప్పుడా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న సంక్రాంతి పండుగ రానేవచ్చేసింది. భోగి పండుగ రోజున ఉదయాన్నే భోగిమంటలు వేసుకుని సంబరాలు జరుపుకుంటే.. అదే రోజు చిన్నారుల తలపై వారి తల్లిదండ్రులు, ముత్తైదువులు భోగిపండ్లను పోసి ఆశీర్వదిస్తారు. 12 సంవత్సరాల వరకు ఉన్న చిన్నారుల తలపై ఈ పండ్లను పోస్తారు. రేగుపండ్లను చిన్నారుల తలపై పోస్తే నరదిష్టి తొలగిపోతుందని, ఆయురారోగ్యాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు.