భారత్‌లో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్లు

70చూసినవారు
భారత్‌లో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్లు
భారత్‌లో మరో నాలుగు రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని యాపిల్ కంపెనీ యోచిస్తోంది. ముంబై, ఢిల్లీలో స్టోర్లు సక్సెస్ కావడంతో విస్తరణ దిశగా ఆలోచన చేస్తోంది. బెంగళూరు, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో కొత్త స్టోర్లు ప్రారంభించాలనుకుంటోంది. ఐఫోన్ 16ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడళ్లను భారత్‌లోనే ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరికొన్ని సంవత్సరాల్లో 25% ఫోన్ల ఉత్పత్తి భారత్‌లోనే ఉండేలా చూస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్