విరిగిన కరెంట్ స్తంభం... ఆందోళనలో ప్రజలు
ఊట్కూర్ మండలం సమిస్తాపూర్ మక్తల్ ప్రధాన రహదారిపై 3 రోజుల క్రితం ఒక ప్రైవేటు వాహనం స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం ఒక్కసారిగా వోరిగి ఉండిపోయింది. వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో స్తంభానికి ఉన్న తీగలు చిన్నారులపై గాని, ప్రజలపై గాని పడతాయేమో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరగకముందే కొత్త స్తంభాన్ని నిర్మించాలని ఆదివారం స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.