మక్తల్: గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే
మక్తల్ పట్టణంలోని ఒకటవ వార్డు, కర్ని గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కొరకు దరఖాస్తులు స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తామని అన్నారు. ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించి సొంతింటి కలను నెరవేరుస్తామని చెప్పారు.