BREAKING: సీతారాం ఏచూరి కన్నుమూత
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 1952, ఆగస్టు 12న జన్మించిన ఏచూరి స్వస్థలం కాకినాడ. 1992 నుంచి ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ్య ఎంపీగా పనిచేశారు.